స్ఫూర్తి -- శక్తి..... కందాలు:-: రామానుజం. ప. జేబులో : 8500630543 .
26)
చిత్తూరు    దరిని    గలదే  ,
ప్రత్యేకాలయము  వెలిసె   ప్రమద గణేశున్  ;
సతతము   భక్తుల  తాకిడి  ,
మతములు చూడక భజించి మ్రొక్కెద రెల్లన్  !!

27)
జయహో  !  గణపతి  బప్పా  !
జయం*ను వ్రాసితివి జగము జేజే  లనియెన్  ;
భయపీడల    ద్రోలెదవుగ   ,
నియమాలను దెల్పి  , శోభ నిత్తువు   నీవే   !!
      *  ' భారతం '  కే   ' జయం '  మరో పేరు.

28)
జగదాంబ యె   నీ  తల్లియు   ,
జగద్రక్షకుడేను  తండ్రి , జయములు నిత్తుర్   ;
జగమెల్లరు  నిను  గొల్తురు   ,
జగమే  తలిదండ్రు లనుచు   ప్రార్ధించితివే   !!

29)
పేర్గాంచె   కాణిపాకం  ,
నీ  మ్రొక్కులు  దీర్చ  వత్తురెందరొ  నిత్యం  ;
ఆంధ్రావనిలో    నుండెను  ,
పరమేశ్వరుని  కొల్వ  సాక్షి  మీదయ  గాదే   !!

30)
వచ్చితి   నిను  దర్శింపగ   ,
మెచ్చితి, పరిసరము శాంతిమయమే చూస్తిన్  ;
తెచ్చితి    యింటికి  గురుతులు  ,
పంచితి,మిత్రులును బంధు సంతతి  మెచ్చన్ !!