స్ఫూర్తి -- శక్తి..... కందాలు:-: రామానుజం. ప. జేబులో : 8500630543 .
 31)
షిరిడీ   సాయిని   కొలిచెద   ,
పరమాత్ముని అంశయేను పరమోన్నతుడున్  :
మురియును   భక్తుల  జూచిన  ,
తరుణోపాయములు దెల్పి ధన్యత జేయున్  !!
32)
మహరాష్ట్రము  నందుండెను   ,
మహరాజైన  , నిరుపేద  బిక్షువు    నొకటే   ;
ఇహపర   లోకము  లొకటని   ,
తహతహ  లాడుచు సుబోధ గావించునతన్  !!
33)
కులమత  భేదము  లేకను  ,
తలచిన చాలును నతండు తన్మయమొందున్;
పిలిచియు , తెలుపును  ధర్మము  ,
కలలో  నైనను  నతనిని   తలచుట  వరమే   !!
34)
శ్రీ  పుట్టపర్తి  సాయి యు  ,
శ్రీ పరమాత్ముగ   సుబోధ  సంపద  నిచ్చెన్   ;
నిల్పె  '  ప్రశాంతి  ' కి  ' నిలయము '  ,
సఫలము  గావించె  నీరు  పథకము ప్రజకున్  !!
35)
విద్యయు  ,  వైద్యము,  క్రీడలు
భద్రతయు  ప్రధాన  అంశములగాన్  ;  సేవా
బధ్ధుల    చేసెను   విరివిగ  ,
బాధలు  తీర్చెను ...విదేశ  , దేశీ యులకున్    !!