స్ఫూర్తి -- శక్తి..... కందాలు:- : రామానుజం. ప.-జేబులో : 8500630543 .

 36)
వందనము   భరత మాతకు  ,
వందనములు నాదు జన్మ భూమికి నిడుదున్ ;
వందనములు   త్రివిధ   దళముల  ,
వందనములు సమర యోధు సంతతి కెల్లన్  !!
                                
37)
జాతీయ  పతాకా   !  జై  ,
జాతియ గీతం, జనగణమన  రచయిత  !  జై  ;
జాతి పిత  గాంధి   జీ  !  జై  ,
జాతిని  నడిపే  స్వతంత్ర  భారత మా  ! జై  !!
38)
మూడు  దిశలలో   సంద్రము   ,
మూడు  దిశలలో  కనుమలు బారులు తీరెన్ ;
వెండిని  తలపించు  నగం   ,
వడివడి  గను  పారు నీరు,  వనరుల తోడన్   !!
39)
జన సంఖ్యయు మిక్కుటముగ  ,
జన జీవనము వ్యవసాయ  చతురత  గల్గిన్  ;
మనమందర  మొక్కటిగా  ,
మాన్యులు   జీవించినట్టి   భారత  దేశం  !!
40)
పూర్వము  నుండియు  సు చరిత,
మౌర్యులు, తుళు, పాండ్య,
                        పల్లవులు, చోళులుతోన్  ;
వీరులు  పాలించిన  స్థలి   ,
వీర  వనిత  రాజ్యమేలె  ఈ భువియందున్  !!