మా ఊరు ఏరు
కొండకోనలు దాటుకు
విశ్వనాధవారి వన్నెల
కిన్నెరసానిలా
వంపులు తిరిగి
వయ్యారంగా
నండూరి వారి ఎంకిలా
వగలుపోతూ
బాపూగారి కథానాయకి
కాలి అందెల రవళిలా
గలగలా ప్రవహిస్తూ
ఊరి జనులకు ఊపిరై
అమృత జలాలనందించేది
మాఊరి సెలఏరు
చెేసుకొన్నవారికి
చేసుకొన్నంత పుణ్యం అన్నట్లుగా
తీసుకొన్నవారికి
తీసీకొన్నంత చెలమలో
తోడుకున్నవారికి
తోడుకున్నంత నీరు
మహమంచి మంచినీరు
మంచినీరా అది
కాదు కాదు
మధురామృతం
ఏరుతల్లి
ఎదను పొంగిన పాలధారలవి
మమ్మల్ని ఆరోగ్యంగా
పెంపుజేసిన
అమృతధారలవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి