ఉగాది పర్వ దినం: --సారమతి రాగాలాపనలతో..!?: -సోంపాక సీత--భద్రాచలం--8639311050
భారతీయ సాంప్రదాయాలకు యవనికగా
వివిధ సంస్కృతుల సమ్మేళనమై
సత్యయుగ ఆరంభానికి చుట్టిన శ్రీకారం..

జడత్వంతో నిండిన జగత్తును
చైతన్యవంతం చేస్తూ మానవాళిని
నూతన ఆశయాల సాధనకై
పురికొల్పే శుభదినం..

షడ్రుచుల సమ్మేళనాన్ని జీవితానుభవాలకు ఆపాదింపజేస్తూ
సంయమన శక్తిని ప్రోదిజేసే శక్తిశాలిని..

శిశిరపు వెతలన్నీ వైదొలగి
ఆశల వసంతాలను ఆఘ్రాణింపజేస్తూ
అమృత ఘడియలు అరుదెంచే
విషువత్కాల శుభసమయం..

కాలాన్ని కమ్మిన కాకుల రొదలన్నింటినీ
తెర వెనుకకు నెట్టేస్తూ  
గండు కోయిలలన్నీ సారమతి రాగాలాపనలతో
ప్రకృతిని పులకింపజేసే 
దివ్య పంచాంగ శ్రవణమే ఉగాది..



               

కామెంట్‌లు