భారతీయ కులవ్యవస్థను
కారుచీకట్లు కమ్ముకుంటూ దళిత దళాలను చుక్కనీరైనా
తాకనివ్వని మూఢత్వంపై విసిరిన
ఆగ్రహపు చర్నాకోలాయే..."మహాద్ ఉద్యమం"..
"చవ్ దార్ "చెరువు సార్వజనీనమంటూ
మున్సిపాలిటీ రాసిన ప్రజాస్వామ్యపు చిరునామా తో
మెహర్ జాతీయులు పురివిప్పిన నెమళ్లై,
మహాద్ జలాలను ఆస్వాదిస్తూ
దర్జాగా"చవ్ దార్" తీర్థాన్ని
దోసిళ్లతో పవిత్రంగా సేవించే
భక్తులయ్యారు..
ఇగోల భావజాలంతో పెట్రేగిపోయే
అగ్రవర్ణాలన్నీ నిమ్నవర్గపు నిజాయితీలపై
అగ్నిపూల లాఠీలను ఝుళిపిస్తూ
చెరసాలల బహుమతులను సిద్ధంచేశాయి..
మూఢత్వపు ఆలోచనలన్నీ
సవర్ణప్రాణాల తొడుగులతో
"చవ్ దార్" చెరువుశుద్ధికై వెంపర్లాడే
పంచపాత్రలుగా ఆ నీటిలో
జలకాలాడాయి..
అభిజాత్యాల సమావేశ వేదికపై
సనాతనుల హక్కులన్నీ
అస్పృశ్యుల హక్కులుగా
తర్జుమా గావించే సత్యాగ్రహసూత్రమై
కడదాకా వెలిగి గెలిచాడు
మన 'అంబేద్కర్'..
ఓ శాంతియుత విప్లవం
ముక్తి సంగ్రామమై,మహాద్ మహోన్నతమై,
"సోషల్ ఎమ్ పవర్ మెంటు"గా తళుకులీనుతోంది నేడు..
రాముడే భీముడై,భీముడే రాముడై;
ఇలపై జీవుడుగా అవతరించిన భీంరావు.. రాంజీ.. అంబేద్కర్ ..రాజ్యాంగ శిల్పే కాదు!?
ఓ గొప్ప మానవతా శిల్పి..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి