కోడి-కుంపటి బాలగేయం:- - సత్యవాణి కుంటముక్కుల- 8639660566

 అనగనగా ఊరిలోన
ముసలి అవ్వ వుండెను
ఆ అవ్వకు వున్నవి కుంపటి కోడీ
అందాల కోడిపుంజు
అరచుచుండె కొక్కొరోయని
ఊరిలోని జనమంతా
ఉలిక్కిపడుచు నిద్రలేచి
పనిపాటలకైపోదురు
అవ్వకుంపటిలో అగ్గిని
ఆడవారు గొనిపోదురు
అన్నమొండ నిప్పుకొరకు
సూర్యుడంత ఉదయించును
సుంతయు సమయమునందే
అవ్వకు తోచెను ఇట్టుల
నాపుంజుా అరవకుంటె
సూర్యోదయమేకాదు
నాకుంపటి లేకుంటే
అగ్గిెట్లా పుట్టు నిచట
అనుకొనుచును ఆ అవ్వా
అందరితో గొడవపడును
గర్వంతో మిడిసిపడుచు
అడవికి పుంజును గొనిపోయెను 
కుంపటియూ గొనిపోయెను
కుళ్ళుమోతు ఆ అవ్వ
ఊరిలోన ఉదయమాయె
ఎప్పటిలా సూర్యుడొచ్చె
ఊరిలోన అమ్మలునూ
ఉడికించిరి బువ్వలను
గమనించగ అవ్వ వచ్చి
గడబిడపడె కాంచినంత
నాకోడియు లేకున్నను
తెల్లవారె సూర్యుడొచ్చె
నాకుంపటి లేకున్నను
అమ్మలంత అన్నమొండె
అనుకొనగా ఆ ఆవ్వకు
అణిగిపోయె గర్వమంత
ఊరివారితో అవ్వ ఉత్సాహంగా కలిసెను
ఊరివారు సంతసించి
ఉన్నతమౌ స్థానమిచ్చె
అవ్వా అని పిలుచుకొంటు
ఆనందం పంచె ఆమెకు
పెద్దదిక్కుగా చూచుచు
ఘన గౌరవ మొసగెనంత
సంతసాన ఆ అవ్వ
సంబరమెంతో పడెను