ఔ మల్ల!: -- బాలవర్ధిరాజు మల్లారం 871 2871 999

 బిడ్డను జూసుకొని 
తల్లి నవ్వినట్టు,
పొలాన్ని జూసి
రైతు నవ్వుతడు.
తల్లి నవ్వినా,
రైతు నవ్వినా, 
పండుగు లెక్కనే ఉంటది.
ఇంట్ల తల్లి ఏడ్సినా
ఇంటికి మంచిది గాదు,
పొలంల రైతు ఏడ్సినా
దేశానికి మంచిది గాదు.
ఔ మల్ల!