ఎండాకాలం అచ్చిందంటే
సిన్న పోర గాండ్లం
ఆటలు అడుడే ఆడుడు!
గాలి దుమారం రావాల్నని
అనుకునుడు, బగ్గ గాలి దుమారం అత్తే ఆగుల నుంచి
బామండ్ల గడ్డకు ఉరుకుడు,
రాలిన మాడి కాయలను తెచ్చుకొని తినుడు, రేన వండ్లు, అల్ల నేరేడు వండ్లు, కల మాడి పండ్లు, సివ సింతకాయలు, ఈత వండ్లు, మొర్రి పండ్లు,
గిట్ల ఏది పండితే ఆ పండ్లను తినేటోల్లం. కొన్ని కొనుక్కొని,
కొన్ని అడుక్కుని.
ఇంకొన్ని దొంగ తనంగ తెంపుకుని.
ఇగ
మర్రి సెట్టు కింద, బజార్ల
మాడి కాయ పిక్కలతో
గోటీలతో, సింత గింజలతో
సిగరెట్ పత్తాలతో, సిత్తు బొత్తు పైసలాట,
పచ్చీసు, నక్కిమూట, ముక్కులు గిచ్చుడు, కచ్చ కాయలాట,రాముడు,సీత, దొంగా పోలీస్,
కాస పుల్ల, రంగా రైట్, కబడ్డీ, కోకో,వాలి బాల్, క్యారమ్,బ్యాట్ మెంటిన్,లగోరి, సిర్రగోనె, చెండాట,బాయిల దుంకుడు, సింతసెట్టెక్కి దొరికిచ్చుకునుడు, అంగుడు దుంకుడు, ఆగుల గొట్టాస్ గోర కాయ,ప్యాకాట,దాగుడు
మూతలు, తాటి కమ్మల్తోని గిరుకలు జేసుకొని ఆడుకునుడు,
తాటి కాయలతోని
బండ్లు జేసుకోనిఆడుకునుడు, సిన్న సిన్న గురిగిలల్ల నూకల బువ్వ అండుకొనుడు,
అందరం కలిసి తినుడు,
ఇనుప పయ్యతోని, సైకిల్ టైరుతోని ఆడుకునేటోల్లం.
పొద్దుగాల లేత్తెనే గీ ఆటలు.
అంబటాల్ల దాక ఆడుకొని
మల్ల తిన్నంక
మల్లా ఆటలే ఆటలు.
ఆడుకునుడు,తిట్టుకునుడు,
కొట్టుకునుడు,
మనసుల ఇసం పెట్టుకోకుంట
మల్ల కలిసి మెలిసి ఉండుడు.
గప్పుడే మంచిగనిపిచ్చేది. పైసలు లేకున్న గని అందరం కలిసి ఆడుకునేటోల్లం.
మరి గిప్పుడు? ఎవరింట్ల ఆల్లే.
పైసలు ఉంటేనే సోపతి. లేకుంటే లేదు.
పైసా మే పరమాత్మ.
పైసానే అన్నీ.
గిప్పుడు పైసల జమానా.
గా జమానే బాగుండే.
గా సిన్న తనం మల్లత్తే
మంచిగుండు.
ఔ మల్ల!
ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 2971 999
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి