బగ్గ మంది
సోపతుల తోనే
సెడి పోతరని అంటరు గని
నా సోపతి గాల్లతో
నేనేమీ సెడి పోలేదుల్లా!
మా మల్లారం ల
నాకు సిన్నప్పుడు
బగ్గ సోపతి ఎవలంటే..
కొమ్ము దేవయ్య,మల్లారం లచ్చిరాజెం,మల్లారం
లచ్చయ్య,
సాలోల్ల సత్తె నారాయన,
ఎస్.దేవయ్య,
బైండ్ల లాలయ్య.
నా సిన్నతనంల
గీల్ల తోనే బగ్గ ఆడుకున్న.
గిప్పటికి గుడ
ఆల్లతో సోపతి గట్లనే
సెక్కు సెదరకుంట ఉన్నది.
పైసల మొకం సూడకుంట,
కులాన్ని లెక్క సేయకుంట
సేసేదే సొక్కమైన సోపతి.
ఔ మల్ల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి