ఔ మల్ల !:-- బాలవర్ధిరాజు మల్లారం -871 3971 999

 మా మల్లారం ల
యాబై యేండ్ల కింద
నాలుగో తరగతి దాకనే  
బడి ఉండేది. 
మా సార్లు సెంకరయ్య సారు( పెద్ద సారు), 
రాజిరెడ్డి సారు, సిన్నసారు.
సెంకరయ్య సారు పోయినంక
రాజిరెడ్డి సారే పెద్ద సారు.
సాకలి పెద్ద దేవయ్య, 
పకీరు, సెర్పపద్దీన్ లు సెప్రాసిలు.
ఒకటో తరగతి నుండి 
పదో తరగతి దాకా 
సామ నర్సిమ్మ రెడ్డి,
కోమట్ల మారుతి, గడ్డమొల్ల లింగన్న, ఎంకయ్య దొర కొడుకు ఇష్ణువర్ధన్ రెడ్డి, సిన్న సారు బిడ్డ రమాదేవి, సత్తె నారాయన దొర బిడ్డ  రమ
బద్దమొల్ల ఎంకన్న, ఎల్లాల సత్తెనారాయన రెడ్డి,  మేరోల్ల దేవేంద్రం, మేరోల్ల సత్తయ్య, సాకలి దేవయ్య,  ఎల్పర్ రైమాన్ బిడ్డ పీసు(  గప్పుడే గాదు, గిప్పటికి గుడ పూర్తి పేరు తెల్వదు) , అంగ అంజయ్య, బి.రాములు, డి.లచ్చిరాజెం, డి.లచ్చయ్య, మ్యాదరి నారాయన, మ్యాదరి శెంకరిలతో కల్సి సదువుకున్న. 
సిన్నప్పటి  గా దినాలే 
మంచిగుండే. 
సిన్నప్పటి సోపతి 
సొక్కం బంగారం లెక్క.
ఔ మల్ల!