నా ఊహలకు
ఊపిరిపోసింది నీవే..!
నా భావాలకు
రూపాన్నిచ్చింంది నీవే..!
చందమామవై
కథల లోకంలో
విహరింపచేసింది నీవే..!
రెక్కల గుర్రం ఎక్కించి
పగడపు దీవులు చూపింది నీవే.!
బాలమిత్రవై
చిత్రాలను చూపింది నీవే..!
బాల్య స్నేహితునివై
మేధస్సును పెంచింది నీవే..!
పుస్తక రూపంలో
నను వరించిన నా నేస్తమా.!
నా ఒంటరి క్షణాలను
మింగిన సహచర్యమా..!
ఇప్పటికీ
నా మదిని వదలని నవనీతమా..!
నా మస్తిష్కపు ప్రియతమా..!!
ఓ...పుస్తకమా!నా సమస్తం నీవే మిత్రమా!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి