వెలుగు కాంతులు:-యం.డి. ఆస్మిన్, 9వ తరగతి.S/o. నసీరుద్దీన్,గ్రామం. జగదేవ్ పేట, మండలం. వెల్గటూర్--జిల్లా. జగిత్యాల.

 ఉగాది తెలుగువారి తొలి పండగ  
పసిపాప నవ్వులా వేప పూవు పూయగ 
కనులవిందు చేసే మామిడికాయలు కాయగ 
నోట్లో వేసుకుంటే కరిగిపోయే బెల్లం తీయగ 
ఉప్పు, కారం, చింతపండు కలబోతగ
ఉగాది పచ్చడి చక్కని రుచినే ఇవ్వగ
పంచాంగ శ్రవణం వీనుల విందుగ 
మంచి చెడులను మానవాళికి తెలుపగ 
జీవితాలలో వెలుగుకాంతులు నింపగ 
వచ్చెను మన ఉగాది పండుగ..

కామెంట్‌లు