-సింగరవేణి శ్రీజ 9వ, తరగతి zphsగుర్రాలగొంది జిల్లా సిద్దిపేట చరవాణి 9704865816
మణిపూసలు
రండి రండి రారండి 
రోజు బడికి రారండి 
చదువు బాగా చదివిన
కొలువు మనకు దొరకండి

రోజు పొద్దున లేవాలి 
అమ్మ నాన్నకు మొక్కాలి
మనలను కన్నవారిని
దైవాలనుచు మొక్కాలి

అమ్మ మంచి దైవము
నాన్న అంటె గౌరవము
గురువు మనకు జ్ఞానమే
ముగ్గురు మనకవసరము

అందమైనది మా ఊరు 
స్వచ్ఛమైనది మా ఊరు 
చెట్లు బాగా పెంచియు
ఆరోగ్యంగ బతికారు 

మణిపూసలు రాస్తున్న
శ్రద్ధగాను చదువుతున్న
వీలు దొరికినప్పుడేమొ
గేయాలను రాస్తున్నా