ముఖానికి మాస్కులు చేసుకున్నవారు
మూర్ఖులుకాదు,
వారే ముమ్మాటికి మృత్యుంజయులు
సోపుతో చేతులు శుభ్రం చేసుకునేవారు
సోగ్గాళ్ళుకాదు
వారే కరోనా కోరలు కొమ్ములు విరిచే వీరులు
ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేవారు
అజ్ఞానులు కాదు వారే
ఘోర విపత్తునుండి తప్పించుకునే విజ్ఞులు
సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకొని
ఇళ్ళళ్ళో బంధీలైపోయినవారు
పంజరంలో చిక్కుకున్న పక్షులు కాదు వారే
కరోనారక్కసికి బలికాని వారికి ప్రత్యక్షసాక్షులు
చివరికి అందరికి ఇదే నా కరోనా సందేశం
స్వీయనియంత్రణనే అందరికీ శ్రీరామ రక్ష
నిర్లక్ష్యం వహిస్తే తప్పదు కరోనా మరణశిక్ష
ఎదురు పడకూడదు భయపడకూడదు
బెదిరించే కరోనా గుండెల్లో నిదురించాలి
కనిపించక, కరుణలేక, కాటికీడ్చే,కరోనాను
కాల్చివెయ్యడానికి, ఖతం చెయ్యడానికి,
వ్యాక్సిన్ వజ్రాయుధం ధరించి యుద్దం
చెయ్యడానికి,అందరూ సిద్ధంగా వుండాలి...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి