శ్రీరాముని సీ శ్రీరాముని సీస మాలిక:-మమత ఐలహైదరాబాద్-9247593432స మాలిక:-మమత ఐలహైదరాబాద్-9247593432

 అవనిలో దైవమై శివ ధనుసువిరువ
           విరివిగా శబ్దాలు పెల్లుమనగ
నగరవాసులమది నాట్యాలుసేయంగ
            యంగరంగానంద సింగిడిగను
ఘనమైన సీతమ్మ వినయమూర్తిని గాంచి
             మరుమల్లె జాజుల మాలలమరె
గంధర్వ దైవాలు ఘనముగా కుసుమాల
             వర్షాన్ని కురిపించె వధువరులకు
చూడచక్కనిజంట రేడు రామయ్యకు
            జనకరాజుకు పుత్రి జానకమ్మ
శ్రీరామ నవమిన సీత కళ్యాణంబు
             జయజయ ధ్వనితోడ జరిగెనపుడు
మంగళాకారుడు మహనీయదాముడు
             శృంగారరాముని చెంతసీత
లోక కళ్యాణంబు చీకట్లనేబాపు
              ధర్మ రక్షణ జేసెధరణిమెచ్చ
శ్రీరామ నామము చిలకోలె పలికిన
              రాక్షసత్వంవిడి మోక్షమందు
ఆ.వె
రామపాద ధూళి రవ్వంత తగులగా
నాతిగాను మారె రాతియైన
రామనామ పదము రమ్యమైనదిగాన
రామదాసు పలికె లయను కూర్చి
కం
రామా! రఘువంశ తిలక
సోమా! సీతమ్మ తోడ సుకుమారునువై
దామా! యే తెంచిన నీ
నామంబును మరువ గలన! నమితముమ్రొక్కన్


కామెంట్‌లు