బాలగేయం:మమత ఐలహైదరాబాద్9247593432-

అన్ని భాషలకన్న
తెలుగు భాషే మిన్న
తెలుగు బిడ్డవు నీవు
గర్వించరా! 

పరభాష మోజులో
మన భాష మరిచేవు
విజ్ఞాన నిధి కొరకు
పరభాషరా!

పట్టుబట్టి నేర్వ
పరభాష కాదిది
జన్మతో నేర్చింది
తెలుగేనురా!

చెంతనే ఉందని
చులకనే చేసేవు
కడవరకు నీపేరు
తెలుగోడెరా!

ఏ చోట నీవున్న
తెలుగు వాడందురు
నీ భాష నీ తెలుగు
నీ దౌనురా!