ఏడేడు లోకాలు
పద్నాలుగు భువనాలు
అమ్మవారికి మ్రొక్కి
అడుగేసె కదలికలు
కష్టాలు నష్టాలు
కలిమి కడగళ్ళు లేములు
సుఖ దుఃఖమేదైన
ఈశ్వర ప్రసాదాలు
అన్ని భరింతుమని
ఆజ్ఞనే ఇవ్వమని
షడ్రుచుల పాకాన
తెలుసుకో వలెనని
నూతనోత్సాహంతో
కొత్త వత్సరమునకు
స్వాగతం పలికేము
సకల జనులెల్లరము
శోభకూర్చే దినము
ఆనంద పర్వము
తీపి కారము పులుపు
ఒగరు ఉప్పు చేదు
అన్ని సమపాళ్ళలో
ఉన్నదే జీవితము
దైవమే అభయమై
నడిపించుటే వరము
బొబ్బట్ల గమ్మత్తు
పచ్చడతొ శుభమస్తు
జగతిదైవము సొత్తు
సాగుటే మన వంతు
కొత్త చిగురును చూస్తు
కోయిలను గమనిస్తు
ప్రకృతిసుగంధాల
అందాన్నితిలకిస్తు
పచ్చని ఉగాదితో
పరవశింతురు జనులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి