ఉగాది (సీస పద్యము):-మమత ఐల-హైదరాబాద్-9247593432

 ఆరోగ్య విలువకు యతిప్రదా నముగాను
       షడ్రుచు లయుగాది చక్క దనము
సమ్మేల నాలతో సందడి జేయుచు
       సంతోష మొనగూర్చె చక్కగాను
పచ్చడి బూరెల పర్వాల వంటలు
     పంచాంగ శ్రవణము బాగు బాగు
గౌరిదే వికిపూజ ఘణముగా జరిపేరు
     పెద్దచి న్నయనక  విధివి ధముగ
ఆ.వె
వత్స రమ్ము లోన వంటప్ర త్యేకత
వేప పూవు మావి వెగటు దినుట
యుగము ఆది గాను ఆయుగా దికిపేరు
మనసు పెట్టి వినుము మమత మాట
కామెంట్‌లు