దర్పం (సీసపద్యం):-మమత ఐల-హైదరాబాద్-9247593432

 మసిబూయ దర్పంబు మసకగాజూపెట్టు          
        నెవరిముఖమువారికెట్లగుపడు
మాసిన యద్దంబు గాసిల్లు గుణమున్న   
        గౌరవంబెట్లుండుఘనముగాను
మంచిగంధంవంటిమనసుగల్గినవారు
        గుణములోమిన్నగాగుర్తుకుండు
మంచిచెడులురెండు పొంచిపొంచియెనుండు
        మౌని వోలె కదులు మంచి పనికి
   ఆ.వె
లక్ష్మివల్లభవినిలాస్యాన్నిగమనించు
నీదుసృష్టిజూడునీరజాక్ష
కల్మశంబుతోడ కమ్మని పలుకులన్
మనసుపెట్టివినుముమమతమాట