ప్రవక్త ఆధ్యాత్మికం (సీసపద్యాలు):-మమత ఐల-హైదరాబాద్-9247593432
మక్కానగరమునమహనీయునిగజన్మ
   నెత్తె ప్రవక్తగా నిజముజెప్ప
పదునాల్గువందలవత్సరాలక్రితము
సర్వమానవులకుసౌక్యమీయ
రాజ్యాన్నినెలకొల్పి రమ్యమయినబోధ
నందించెజనులకునాప్తుడుగను
పర్షియన్ రోమన్ల ప్రబలమైనా ధాటి     .                        
 యూదుల గెలిచిన యోధు డతడు
 ఆ.వె||
యందులోనరబ్బులందరీతాకిడి
యతిసులువుగగెలిసెయాప్తబంధు
విస్తరించెగొప్పవిఖ్యాతయిస్లాము
మనసుపెట్టివినుముమమతమాట

సీ
యావత్ ప్రపంచాన నాధ్యాత్మికంబైన
సామ్రాజ్య మునకును స్థాపకుడుగ
ఇస్లామ్ ప్రవక్తగా యెదురై ముహమ్మదు
  సంక్షోభచీకటిశాంతిగోర
ఆదాయగర్షణయధికారగర్షణ
   నైతికవిలువలన్ నలుపుతుండ
కారుచీకటిలోనకాంతికిరణమౌచు
 ప్రభవించెనీప్రభుపరమసాధు
ఆ.వె||
ధర్మనమ్మకములు దారితప్పిన వేళ
జ్ఞానమీయవచ్చెఘనుడితండు
వందనంబులిడుదుభక్తి ప్రవక్తకు
మనసుపెట్టివినుముమమతమాట