సీ
కలికాలమీరీతి కదలిపోవుచునుండె
వైవిధ్య భరితమై వణుకుతోడ
జనసమూహాలన్ని వనవిహారంమాని
గడిపిరే కాలాన్ని గడపలోనె
వాహనాల పరిది వాకిళ్లు దాటక
కాలుష్య మొలకల కలుపుతీసె
పనిపాటలనువీడి ప్రజలంత గృహమున
బందీలుగా మారె బ్రతకనేర్చె
ఆ.వె
క్రోవిడనుచు వచ్చి తావులేక తిరిగి
నూరు వాడనంత దారిగాచి
పట్టుబట్టి జనులముట్టడించుచునుండె
మనసు పెట్టి వినుము మమత మాట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి