1
కంటికి కనబడకుండా
కాల్చి వేయబూనెను
పాపమో శాపమో
వైరెస్ పగబూనెను
వారెవ్వా కరోనా
వగలమారి కరోనా
2
కాలజ్ఞానము పలుకులు
కంటిముందుకొచ్చెను
మన సంస్కృతి గుర్తు చేసి
మంచి గుబులు రేపెను
వారెవ్వా సంస్కృతి
నిన్నొదిలితెనే దుర్గతి
3
వీరబ్రహ్మేంద్రస్వామి
చెప్పెనిట్టి వాక్కులు
కలియుగాంతమునందు
కలుగునట్టి వింతలు
వారెవ్వా కలియుగమా
ఇదేనీ ధర్మమా
4
చేయి చేయి కలపకుండ
నమస్కారమందాము
ధర్మాన్ని నిలుపుదాము
కరోనాను తరుముదాము
వారెవ్వా కరములు
దండముతో మెప్పులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి