సమస్యాపూరణ
కం
ఘనమగు విశ్వాసముతో
మనవారనినమ్మి బ్రతుకు మమకారముతో
కనకానికి సమమౌ 'నీ
*శునకమ్మునుభక్తిగొలువ శుభములుగల్గున్*
సమస్యా పూరణ
కం
దూరము మనసుకు పెరిగిన
భారముగా మనిషి తోచి; పలుకులనెల్లన్
ప్రేరణగా గుర్తించక
*కూరిమి నిను విడిచి పోయి కోపము వచ్చున్*!
దత్తపది:-గణములు ,యతి ,ప్రాస ,వ్యాకరణము
ఐచ్ఛిక పద్యం
కం
నక్షత్ర గణములందున
రక్షణ కెతిప్రాస చేర్చి లయలను కూర్చన్
లక్షణ వ్యాకరణముతో
తక్షణమే పద్య మమరి ధగధగమెరియున్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి