అంబెడ్కర్(సీసపద్యం):-మమత ఐల-హైదరాబాద్-9247593432

 ఒడిదుడుకులనన్నినోర్పుతోగెలిచాడు              
      స్వేఛ్ఛాసమానత్వవిలువబెంచ
రాజ్యాంగ గ్రంథము వ్రాసియం బేడ్కరు                           
       భారతరత్నగావాసికెక్కె
సంఘసంస్కర్తగా సద్బు ద్ది తోడను                 
       మేధావులందున మేటియయ్యె
ఆత్మవిశ్వాసియై యడుగేసె యానాడు
       కులముగోడలనన్నికూలగొట్టి
ఆ.వె
ధర్మముండనేనిదాడిలోయోటమి
దరికిరాదురాదుధరణిలోన
యనెడిసూక్తినిచ్చియాత్మబలము బెంచె
మనసుపెట్టివినుముమమతమాట
లక్ష్మిప్రసన్నం
    (సీసపద్యం)
*************************
ఇనుపగజ్జెలతల్లియింట్లోకిరాగానె
      బంగారుగజ్జెలభామవెళ్ళె
వొకరంటెనొకరికి యొనగూడదిలలోన
     నొకరిటు నొకరటు నుందు రెపుడు
ధనమెంతయున్నను ఘణమేమియునుగాదు
      కొంతలేమియుగూడకొదువయగును
కొదవతీర్చేతల్లి కొరకు వేడేరిల
     శ్రీలక్ష్మి రాకకై శీఘ్రముగను
ఆ.వె
వేచిచూతురుకద వేయి కన్నులతోడ
హరికి జెప్పివచ్చు నమ్మ యనుచు
హాయిగొలుపునమ్మహరితోడవచ్చినన్
మనసుపెట్టివినుముమమతమాట