హాస్య బాలగేయం:-మమత ఐలహైదరాబాద్-9247593432
ఆపండంటు బస్సెక్కాడు
ఆయాసంతో నిలుసున్నాడు

కూర్చుండుటకు దిక్కులు చూస్తూ
తికమక పడుతూ ఉన్నాడు

అంతలోనే వచ్చేసింది
టికెట్ టికెట్టని కండాక్టర్

టికెటిస్తానని చెప్తుంది
ఎక్కడికని ప్రశ్నిస్తుంది

మల్లడుగంటు తిమ్మయ్య
మరి మరి పెట్టెను ఇబ్బంది

చికాకు చెందుతు కండాక్టర్
చిట్లించింది తన మోము

మల్లడుగు మల్లడుగు
మల్లడుగంటే మల్లడుగే

ఎన్నిమాట్లని అడిగేది
రావే! పోవే! అంటావా

అని శివాంగి లాగా దూకింది
తిక్కయ్యవంటు తిట్టింది

అంతట్లోకే వంచ్చింది
పిల్లి అడుగంటు ఒకస్టేషన్

చీదరించుకొని కండాక్టర్
తిమ్మయ్య నక్కడ తోసింది