భాష(సీసపద్యము):-మమత ఐల-హైదరాబాద్-9247593432

 తెలుగుహిందీఉర్దుతెలిపెతమిళమైన
    భావముండేననిభాషలోన
భాషప్రాధాన్యతభావంబుకోసము
    బద్రపరుచుటకైభాషకూర్పు
మహిమాన్వితంబైన మాన్యులన్ దలచేను
    వందనంబునిడుదువారికృషికి
సంస్కృతంబుననుండి సంకేతమునుబట్టి
    ద్రవిడభాషలువచ్చెధారతీరు
ఆ.వె||
ద్రవిడభాషలోనిధారయేనుతెలుగు
వృక్షమేదియైనవిత్తమదియె
నక్షరాలకూర్పునావిధంబేగదా!
మనసుపెట్టివినుముమమతమాట
ముక్కోటిఏకాదశి
     ( సీసపద్యం)
**********************
వాకిళ్ళుదెరచునే వైకుంఠ మందు ,ము
      క్కోటి యేకాదశి గొప్ప దినము
వేయికన్నులతోడవేచిచూసేరయ్య
      వేగంగమేలుకో విష్ణుదేవ
దర్శనంబునుగోరిదర్వాజనుత్తర
      ద్వారమందునిలచి ధరణి లోని
భక్తులన్ గాచేటి వైకుంఠ వాసుడా
       యజ్ఞానమునుదుంచియభయమీయ
ఆ.వె
పాలకడలిపైనపవ్వళించిన దేవ
గరుడవాహననినుగాంచప్రజలు
చూడధన్యులైరిశుభమంగళాకర
మనసుపెట్టివినుముమమతమాట