వేసవి కాలం (బాలగేయం):-మమత ఐల-హైదరాబాద్-9247593432
భగభగ మండే ఎండలు చూడు
వేసవి కాలం ధగడులు చూడు
కాలు కదపని సెగలను చూడు
దప్పిక తీరని వేడిని చూడు

కోపగించెనో భాస్కరుడిపుడు
తన సమయంబని తలచెనఇపుడు
ఉగ్రరూపమును చూపుచుండెను
ధరణికి నెర్రలు పెట్టుచుండెను

రవిప్రకాశముకు గుంటలువాగులు
చుక్క మిగిల్చ

క ఇంకిపోయెనే
బక్కజిక్కిన శ్రమ జీవులను
ముప్పుతిప్పలు పెట్టుచుండెనే

పశుపక్ష్యాదులు చెట్టుచేమలు
వేడి మంటలకు పురుగుపుట్టలు 
మాడుచుండెను మండుటెండలకు
కష్టము జీవిది కాలము రవిది