అంబేద్కర్ జయంతి సందర్భంగా:-మమతలమ్మ పదాలు:-మమత ఐలహైదరాబాద్9247593432
సమాజ సేవనిరతి
సాటిలేనిది ఖ్యాతి
అంబేద్కరే జ్యోతి
ఓ మమతలమ్మ

బానిసల బ్రతుకెంచె
చీకట్లనే తుంచె
ఘనకీర్తి సాధించె
ఓ మమతలమ్మ

జ్ఞానమై ఉదయించె
సంకెళ్ళనే తెంచె
జన బలగమై నిలచె
ఓ మమతలమ్మ

పోరుకూపిరి పోసె
కష్టాన్ని తామరిసె
మార్పు కొరకై చూసె
ఓ మమతలమ్మ

పర బాధ తనదిగా
పదుగురిలొ ఒకడిగా
నిలిచెనీ విధముగా
ఓ మమతలమ్మ

అవమానముల నోర్చె
అసహాయతను మార్చె
ఆశయాలను కూర్చె
ఓ మమతలమ్మ

బుద్ధ బోధన తలిసె
రాజ్యాంగమే రాసె
రత్నమైతా నిలిసె
ఓ మమతలమ్మ

బాణుడై ఉదయించె
రవికాంతులను పంచె
భరత కీర్తిని పెంచె
ఓ మమతలమ్మ