బడి వయస్సులోకన్న
బండి దేనికిర నాన్న
పట్ట పగ్గాలు లేక
పడిపోతే గతేంటన్న
బ్రతికేదే జీవితం
మితిమీరకు అనుక్షణం
కలిమి ఎంతకలిగిన
కంట్రోలే నీకు బలం
సర్కస్ లో జంతువు
కాదుర నీవెప్పుడు
దారినెరిగి బండినడుపు
మేలుజరుగు నెప్పుడు
తీర్చుకుంటె అందము
బండి మీద విన్యాసం
కత్తిమీద సామునాన్న
భావిపౌరడవు మున్న
బాధ్యత వుండాలిరా..
అమ్మానాన్నల కన్ను
నీవేనని తెలుసుకోర
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి