సమస్యా పూరణలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 కం
హరిహరియని వేడినగని
నరహరి కావంగ రాడె ; నయవంచకులే
ధరలో ఘనతను పొందితె
*పరమాత్ముని సేవజేయ బాధలెకల్గున్*
కం
హరినామములోన మునిగి
బురదన తనయున్ని ద్రొక్కెమూర్తీ!కనవే
సిరులడిగెన భక్త వరుడు
*పరమాత్ముని భజన సేయ బాధలె కల్గున్*