తొలకరి చినుకు వచ్చిన వేళ
ప్రకృతి మురిసిన వేళ
ప్రజలందరూ ఆనందంగా ఉన్న వేళ
భూమి మెచ్చిన వేళ
సీతమ్మ మురిసిన వేళ
శ్రీరాముడు నవ్విన వేళ
అంగరంగ వైభవంగా
సీతారాముల కళ్యాణం
చుక్కలన్ని పువ్వులై
సీతమ్మ జడ చేరనే
సూర్యుడే సింధూరమై
రాముడి నుదిటిన చేరనే
జనకుని గారాలపట్టి
దశరథుని ఇంట కాలు పెట్టి
ప్రపంచమే మెచ్చిన వేళ
దేవుళ్ళు దిగివచ్చిన వేళ
అంగరంగ వైభవంగా
సీతారాముల కల్యాణం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి