ఉగాది పచ్చడి: -వరుకోలు ‌మాధవిగృహిణి, కవయిత్రిసిద్ధిపేటచరవాణి :9441782816.

 కుమ్మరింటికెళ్లిన 
కొత్తకుండ తెచ్చిన 
కొత్తకొండ అంచులకు
మామిడి తోరణం కట్టిన
పసుపు కుంకుమలతోడ
అలంకరణ చేసిన
చింత పండు వేసిన
బెల్ల మందు కలిపిన 
కోతమామిడికాయ తెచ్చి 
కోసి అందువేసిన
తీర పూసిన వేపపువ్వు 
తీసి అందువేసినా 
పచ్చి కొబ్బరి తురుమునేను
కొద్దిగందు లేసిన 
మర్రి ఆకుదొప్ప కుట్టి
పచ్చడేమొ పోసిన 
దేవుని దగ్గర పెట్టిన
మంచిగాను మొక్కిన 
ఇంటిలోని అందరికి
ఇంపుగాను ఇచ్చిన 
ఉగాది సంబరాలు
ఊరంత జరిగెను
కరోనా భయముతో 
దూరదూర ముంటిమి
ప్లవనామ వత్సరమా
పాడువ్యాధినిపారద్రోలు
స్వేచ్ఛగా  తిరిగే రోజు
మళ్లి మాకు ప్రసాధించు.

కామెంట్‌లు