ఆకుకూరలు :-వరుకోలు మాధవి-గృహిణి,కవయిత్రి-గట్లమల్యాల, సిద్ధిపేట-చరవాణి:9441782816.

 కూరలండి కూరలు ఆకుకూరలు 
ఆకుపచ్చ దనము తోడ అందంగుండును 
పెంచాలండితోటలో కష్టమనకను
తోట కెక్కువ నీరు అవసరముండదు
అమ్మకానికి త్వరగ అందుచుండును
పెరిగి పెద్ద ఆకులు అవ్వగానే
తేవాలండి సంతకు అమ్మకానికి
వీటిలోన పోషకాలు ఎక్కువుండును
విటమిన్లు పుష్కలంగా దొరుకుచుండును పొయ్యిమీద తొందరగా ఉడికి పోవును
గ్యాసు మనకు చాలా పొదుపు జేయును 
మటను,చికెను తిన్న ఒళ్లు మందగించును
ఆకు కూర వండి తింటే త్వరగ అరుగును పప్పుల,చెట్నీల, సాంబారులన్నిట
ఆకుకూర జత చేయ అందముండును
అన్నములో కలుపుకొని ఆరగించిన 
బలముకలిగి మనకెంతో హుషారొచ్చును
ఇంటిచుట్టు ఖాళీ జాగలున్నచో
ఆకు కూర విత్తనాలు చల్లాలండి
వృధా చేసే నీళ్లను పెట్టాలండి
ఆకుకూరలు సమృద్ధిగ పెంచాలండి
డాబా పైన ఖాళీ స్థలముయున్నచో
మూరలోతు మట్టిపోసి మళ్లుజేయుము
ఆకు కూర విత్తనాలు చల్లాలండి 
మనకూరలు మనమే పండించాలండి 
డబ్బుఆదాఔనండి ఆలోచించండి
అందరము ఆకుకూరలు పెంచాలండి
ఆరోగ్యంగ జీవితం గడపాలండి.

కామెంట్‌లు