కూలితల్లి బతుకు:--వరుకోలు మాధవి-గృహిణి, కవయిత్రి-గట్లమల్యాల సిద్ధిపేట జిల్లా-చరవాణి:9441782816.

 కట్టెలన్ని కట్టగా 
కట్టుకొని నెత్తిన 
పెట్టుకొని వెళ్లుచుండె
కూలి తల్లి చూడరా
కాళ్ళ చెప్పు లేవుగ
పొట్టకూటి కోసము
ఆ తల్లి బాధలు 
చెప్పనెవరి తరమురా
గుండెలంతబాధరా
చంకన బిడ్డను గట్టుకొని 
సాగుచుండె తల్లిరా
కట్టెలన్ని అమ్ముటకు
వాడ వాడ తిరిగెరా
కట్టెలు... కట్టెలు..... అమ్మ 
అరిచి అరిచి నోరుఎండె
పిల్లవాని కాకలాయె
గుక్క పట్టి ఏడుస్తుంటే 
తల్లి మనసు ఆగలేదు
అగ్గువకే కట్టెలన్ని
అమ్మివేసె ఆ తల్లి 
వచ్చిన డబ్బులతోటి 
దుకాణానికి వెళ్ళినాది
పాలు కొన్ని తెచ్చి నాది 
పాపకు త్రాగించినాది 
కడుపునిండగానెబిడ్డ 
కంటినిండా నిద్రపోయె
కష్టాలకెప్పుడు
కన్న తల్లి వెరువదు
తన సర్వస్వమునంతా 
బిడ్డలకేధారపోయు
అందుకే లోకంలో 
తల్లినెపుడు దైవంగా
పూజించి తీరాలి.