అక్షర యజ్ఞం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
బాలబాలికలు రావాలి బడికి
పూల మాలికలు తేవాలి గుడికి
చదువులను కోరి ఒదిగి రావాలి
పదవిలో చేరి ఎదిగి పోవాలి ..!

ఈ బడిలో ఉండే మీ గురువు
తీర్చునులే మీ చదువుల కరువు
పొందికతో  మీరు పెట్టాలిక దండం
ముందిక లేదులే ఎలాంటి గండం!

మక్కువతో పుస్తకపఠనం చేస్తే 
పెక్కు తెలివి తేటలు మీకిక మస్తే
గురువు చెప్పిన ముద్దుల మాట
విని మరి మరువకు నీవే పూట!

ఆటపాటల ఆనందంతో
తెలివితేటల అనుబంధంతో
మేం అక్షర యజ్ఞం సాధిస్తాం
ఇక తక్షణ మార్గం శోధిస్తాం !

మా బడిలో గురువును అర్థిస్తాం
మేంఒడిఒడిగాప్రార్థన పూరిస్తాం
చదువుల వరమునే మేం కోరుతాం
పదవుల శిఖరము నే చేరుతాం..!

మేం వెన్నెల జల్లులు కురిపిస్తాం
మా వన్నెల మల్లెల మురిపిస్తాం
చదువుల తల్లిని మేం ప్రార్థిస్తాం
పదవుల మా మల్లిని అర్తిస్థాం!

మా స్నేహ దీపాలు వెలిగిస్తాం
మేం ద్రోహ పాపాల చిదిమేస్తాం
మంచితనాన్ని మేం పెంచేస్తాం
మా మానవత్వాన్ని పంచేస్తాం!