చిన్నారి బాలకులం
పొన్నారి బాలికలం
పువ్వులా నవ్వుతాం
నవ్వులే రువ్వుతాం
పచ్చ తోరణం కట్టించి నాన్న
వెచ్చని హారతి ముట్టించి అమ్మ
మా పుట్టినరోజును జరిపిస్తారు
మమ్ముల ముద్దుగా మురిపిస్తారు!
తలంటు స్నానం చేపిస్తారు
అద్దం ముద్దుగా చూపిస్తారు
మాబుగ్గన చుక్క పెట్టేస్తారు
వారు టక్కున దిష్టి తీసేస్తారు!
గుడికాడికి తీసుకువెళ్తారు
దేవుడి ప్రతిమకు మొక్కిస్తారు
ఇంటికి తిరిగి తీసుకు వస్తారు
కంటి పాపల మమ్ముల చూస్తరు!
సూటు బూటు తొడిగిస్తారు
స్వీటు హాటు తినిపిస్తారు
ఎక్కువ ప్రేమను చూపిస్తారు
మక్కువతో మము దీవిస్తారు!
పిన్నలు పెద్దలు వచ్చేస్తారు
కన్నుల కింపుగా వీక్షిస్తారు
పెద్దలు సుద్దులు వినిపిస్తారు
పిల్లలు ముద్దులు అందిస్తారు!
మా దోస్తులు కూడా వస్తారు
బహుమతులు ఎన్నో ఇస్తారు
వెంటనే మేము స్పందిస్తాం
అతిథులందరికి విందిస్తాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి