మేం చదువు సంధ్యల పిల్లలం
మా పదవి పందెపు మల్లెలం
చదువుపై శ్రద్ధ ఉన్న వారలం
పదవిపై ముద్ర గొన్న పోరలం !
మేం మోగిస్తాం మా బడిగంట
పండిస్తాం మా చదువుల పంట
గలాటా ఎవరితో పెట్టుకో మంట
కోలాటమేస్తూ గుట్టుగ ఉంటామంట
మేము ఖగోళ శాస్త్రం చదివాం
మా ఆగమ శాస్త్రంలో ఎదిగాం
గ్రహ స్థితిగతులను కని పెట్టాం
గృహ శాంతికి గమ్యం చూపెట్టాం
మేం సత్యాగ్రహములు చేస్తాం
మా నిత్య గ్రహ బాధల చూస్తాం
క్రాంతి పథంలో మేం పయనిస్తాం
మా శాంతి గృహంలో శయనిస్తాం
ఇష్టంతో కాయకష్టం చేసుకుంటాం
నష్టాల సమంగా చూ సుకుంటాం
కలసి మెలసి మసలుతూ ఉంటాం
ఇలన వెలసి అంతా బ్రతుకుతుంటాం
మమతానురాగాలు పెంచుకుంటాం
సమంతాను భోగాలు పంచుకుంటాం
సై సై అంటూ సాగుతాం ముందుకు
జై జై అంటూ మా ఆనందం విందుకు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి