ముద్దు ముద్దు బొమ్మలతో
ఖుద్దుగ అచ్చైన కమ్మలతో
ముస్తాబైన మాఈ పుస్తకం
మచ్చికైన మనందరి నేస్తం!
పగడాల్లా పొందు గుండు పటాలు
ముత్యాల ముద్దుగుండు అక్షరాలు
నిండుగ మెండగ అలరారుతుండు
కన్నుల పండుగ ఇల కలిగిస్తుండు!
కవితల ఖ్యాతిని అందిస్తుంది
కథల నీతిని వేగం సంధిస్తుంది
మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది
ఘన విజ్ఞానాన్ని కలిగిస్తుంది!
హృద్యమైన పద్యాలను అందిస్తుంది
సదృశ్య మైన గద్యాలను బంధిస్తుంది
అదృశ్యమైన సామెతలకు సందిస్థుంది
నీకు నాకు అనకుండ అందరికీ విందిస్తుంది!
చదరంగం ఆటలను నేర్పిస్తుంది
పదరంగం పాటలను పాడిస్తుంది
ప్రతి పొద్దు వీడకుండ చదివిస్తుంది
రద్దుకాని సుద్ది బుద్ధిని అందిస్తుంది
మన మస్తకాన్ని పదును పెట్టి
ఘన పుస్తకాన్ని మనచేతబట్టి
దినమంతా ఖుద్దుగ చదువుదాం
మనమంతా ముద్దుగ ఎదుగుదాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి