ప్రశ్న-జవాబు: -గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూలు జిల్లా.-సెల్ నెంబర్.9491387977.
బాలబాలికలు రారండి
పూల మాలికలు తేరండి
భారతి మెడలో వేయండి
హారతి మీరు ఇవ్వండి...!

ఆ తల్లి దీవెనలు పొంది
మీ మదిలో తృప్తి నొంది
పాఠం చక్కగా చదవండి
ప్రశ్నకు జవాబు వెతకండి!

గాలి ఉన్నది ఎందుకు తెలుసా
ప్రాణాలు శ్వాసించే టందుకు మనసా
నీరు ఉన్నది ఎందుకు తెలుసా
ప్రాణుల దాహం తీర్చే టందుకు మనసా

ధరణి ఉన్నది ఎందుకు తెలుసా
ధాన్యం పండించే టందుకు మనసా
మరి ధాన్యం ఉన్నది ఎందుకు తెలుసా
ప్రాణుల కడుపులు నింపేందుకు మనస

మేఘంఉన్నది ఎందుకు తెలుసా
వర్షం కురిపించే టందుకు మనసా
ఆమని ఉన్నది ఎందుకు తెలుసా
అందాలను అందించే టందుకు మనసా

వెన్నెల ఉన్నది ఎందుకు తెలుసా
కన్నుల విందు చేసేటందుకు మనసా
చీకటి ఉన్నది ఎందుకు తెలుసా
వెలుగు విలువ ను తెలిపే టందుకు మనసా

గుళ్ళూ గోపురాలు ఎందుకు తెలుసా
పాప పుణ్యముల ప్రక్షాళనకు మనసా
వీని అర్థం పరమార్థం తెలుసుకో రా కన్నా
తెలియకుంటే నీ జీవితం గుండుసున్నా!