ముద్దపప్పు :--వరుకోలు మాధవి -కవి,గృహిణిశ్రీనగర్ కాలనీ సిద్దిపేట జిల్లా:సిద్దిపేట చరవాణి:9704865816

కందిపప్పునుతీసుకొని
కుక్కర్లోన వేసి దానికి
సరిపడ నీళ్ళను పోసి 
చిటికెడు పసుపును వేసి
పొయ్యి మీద పెట్టి 
నాలుగు విజిల్స్ రాగానే 
ఉడికిందని తెలుస్తుంది.
పప్పు గుత్తితో రుద్ది 
కడాయిలో నూనె పోసి 
ఎండుమిర్చి, కరివేపాకు 
జీలకర్ర,వెల్లుల్లి 
దోర గాను వేగగానె
తాళింపు పెట్టుకొని 
పప్పుల ఉప్పు కలుపుకుంటె
ఘుమఘుమలాడే ముద్ద పప్పు 
కమ్మని రుచి వాసనతో 
నోరూరించు అందరికి
వేడివేడి అన్నంలో 
కాస్త నెయ్యి వేసుకొని
ముద్దలు చేసి తింటుంటె
ఆహాహా........
మహాబలము వచ్చండి
అందులోను విటమిన్లు
పుష్కలంగ దొరుకండి.