తేనియలు:--బి.కిరణ్ గౌడ్-9866965846

 కర్రపుల్లలు ఏరుకొచ్చి
ఒక్క దగ్గరకు తెస్తుంది
చక్కగా దాని ముక్కుతోనే
పిచుక తన గూడును కడుతుంది.... 111

మనిషికంటే ఎంతో గొప్పగ
అది దాని గూడును కడుతుంది
కష్టపడితె ఫలితముందని
ఆ పిచుక మనకు నేర్పుతుంది....112