ననుచు పలికెదరుగ యవని జనులు
గట్టిగాను వీచ గాలి లేదందువా
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
98. ఆ.వె. పాములన్ని కలసి పాతాళమున నుండు
పక్షులన్ని గూడి పైకి యెగురు
మధ్యలోన నుండ మానవునికి ముప్పు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
99. ఆ.వె. రావి చెట్టు చుట్టు రమణులు తిరిగేరు
నీసడింపు పొందు నీత చెట్టు
పూర్వ జన్మ మందు పుణ్యము కాబోలు
రమ్య సూక్తులరయు రామకృష్ణ .
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి