నీతి పద్యాలు:-సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535.
88.ఆ.వె. పుణ్యము కొరకనుచు పోదురు తీర్థాలు
               సంతసమును గలిగి సకల జనులు
               యాత్రలందు పొందు యాతనలెన్నెన్నొ
               రమ్య సూక్తులరయు రామకృష్ణ .

89. ఆ.వె.రెండు చేతులందు నిండుజీవితముండు
               నిచ్చుకున్న లేక పుచ్చుకున్న
               చేయు వందనంబు చెడును దూరముజేయు
              రమ్య సూక్తులరయు రామకృష్ణ.

90. ఆ.వె. బాధ కలుగజేసి భయపెట్టు నూహలు
                 పెరుగుచుండు మనల పిరికి జేయు
                నిజము తెలియగానే నిట్టూర్పు తప్పదు
                రమ్య సూక్తులరయు  రామకృష్ణ.