నీతి పద్యాలు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.
91. ఆ.వె. ధరణి పశువు తోలు దద్ధరిల్లును డప్పు 
                 పాము తోలు చాల పలుకు వెలను
                 మనిషి తోలు జూడ  పనికిరాదునెటను
                 రమ్య సూక్తులరయు రామకృష్ణ .

92. ఆ.వె. చక్కనైన విద్య చుక్కాని భవితకు
                నేర్చుకొనుము నీవు నిక్కముగను
               చదువుకున్న గలుగు చాలా సుఖంబును
               రమ్య సూక్తులరయు రామకృష్ణ.

93. ఆ.వె. చెడ్డవాడు నెపుడు నడ్డదారి నడచు
                 బాధ పెట్టు పరుల బహు విధముల
                 మురుగునీటి జూచి  మురిసిపోవదె దోమ
                 రమ్య సూక్తులరయు రామకృష్ణ.