మామిడి పండు:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్: 9908554535.

  అడవిలో ఒక మామిడి చెట్టు పైన పక్షి ఒక్కటి వాలింది .ఆ కొమ్మ చివరన మంచి మామిడి పండు ఉంది .కానీ ఆ పక్షి అప్పుడే ఆహారం తినడం వలన ఆ పండు జోలికి పోలేదు.
       ఆ చెట్టు కిందకు ఒక నక్క వచ్చింది. అది పక్షితో ఆ పండును కొరికి  క్రింద పడవేయమని అంది. కానీ పక్షి అందుకు అంగీకరించలేదు.
        ఇంతలో అక్కడకు ఒక వేటగాడు వచ్చాడు. అతడిని చూసిన నక్క అక్కడే ఒక మూల నక్కి దాగి ఉంది. అతని వద్ద విల్లు, బాణాలు లేవు .అతడు ఆ మామిడి పండును చూసి ఒక రాయిని పైకి విసిరాడు. ఆ దెబ్బకు ఆ పక్షి ఎగిరిపోయింది.కానీ ఆ రాయి గురితప్పి   పండు క్రింద పడలేదు. మరొక రాయిని విసిరాడు. వెంటనే ఆ పండు కింద పడింది. అది అతడు పట్టుకోవాలని ముందుకు వెళ్ళాడు .అతనికి భయపడిన నక్క అక్కడి నుండి పారిపోయింది.
         నక్కను చూసిన  అతడు ఆ పండు సంగతిని వదలి తన విల్లు బాణాల కొరకై వెనుకకు తిరిగి వెళ్ళాడు .ఆ లోపలే నక్క తిరిగి వచ్చి  ఆ పండును అందుకుంది.  వేటగాడు విల్లు బాణాలు పట్టుకుని వచ్చి నక్కను తన బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బకి నక్క  మరణించింది .ఆ పండుతో పాటు అతనికి నక్క కూడా దొరికింది.
       కానీ అతడు తిరిగి వాలిన పక్షిని కూడా కొట్టి తీసుకొని వెళ్ళాలని తన విల్లుకు బాణాన్ని  జోడి స్తుండగా ఒక పాము అతడిని కాటు వేసింది. పాముకాటుకు అతడు మరణించాడు .వెంటనే ఆ పక్షి క్రిందనున్న పండును తీసుకొని ఆరగించింది .అందుకే దురాశ పనికి రాదంటారు పెద్దలు. దురాశతోనే వేటగాడు మరణించాడు.