చందమామ పదాలు:-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819
పాపాయి నవ్వులు
తోటలో పువ్వులు
ముచ్చటగ రువ్వును
   ఓ చందమామ! 1

వినగ పెద్దల మాట
కనగవీరుల బాట
విరియు పూలతోట
   ఓ చందమామ!  2

మంచి కోసము బ్రతుకు
నీతి బాటను వెతుకు
రీతి పదములు పలుకు
     ఓచందమామ! 3