చిత్రమునకు పద్యమాలిక: - డాక్టర్.కొండబత్తినిరవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819
నోరు పిడచ గట్టె నూరూర దిరిగిన
గ్రుక్క బట్ట లేదు చుక్క నీరు
నేల నడవ లేక కూలబడినగాని
దయను జూప లేరు దరికి రారు

మానవత్వమున్న మనుజులు నేడేరి?
ఎవరి గోల వారి దేమొ జూడ
గొప్ప దేశ మనుచు గొప్పగా చెబుదరు
ఆదు కొనగ రారె యాప్తు లెపుడు

ఒక్క పెద్ద మనిషి చక్కని మనసుతో
తీర్చ  వచ్చె తృష్ణతృప్తి తోడ!
బ్రతుకునిచ్చె నీవు బ్రతుకుమెల్లప్పుడు
పుణ్యమూర్తి వయ్య!పుడమి లోన

  


కామెంట్‌లు