కులమతములరోసి కుళ్లుకుతంత్రాల
వదలి కదలినావు భవితపథము
అన్ని వర్గములను నాదరించిననీవు
భరత ఖండ మందు వన్నె కెక్కె
స్వార్థపూరిత భావన వదలిపెట్టి
దేశసౌభాగ్యమునకు ప్రదీప్తమైన
భవ్యరాజ్యాంగ రచనను,భావిజాతి
మెచ్చునటులను,నందించిమెరసినావు
ఎంత దిట్టు కున్న నంతకంతకువృద్ధి
చెంద,తపముజేసిచెలగు చుండ
భరతజాతియొసగె "భారతరత్న"ను
తరుగ బోదు ఖ్యాతి తరతరాల
ఆశ యాల తోడ యంబేడ్కరునిబాట
నడువ వలెనుజాతి నందనముగ
నిలుచునతనికీర్తి నిఖిలలోకములందు
పాడు కొనుము నతని భవ్య చరిత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి