ఉగాది..:-జి. అరుణ్ కుమార్, 9వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాం,మండలం. వెల్గటూర్, జిల్లా. జగిత్యాల

 ఉల్లాసంగా ఉత్సాహాంగా వచ్చెను  ఉగాది
తెలుగు వారికి నూతన సంవత్సరాది
షడ్రుచుల కలయికతో ఉగాది పచ్చడి
తెలుపును మనకు జీవితసారాన్ని 
కష్టసుఖాలను ఒకే విధంగా తీసుకొమ్మని
మామిడి తోరణాలతో, తీయని బూరెలతో ఉగాది 
అలరించును అందరినీ
సంతోషంగా సంబరంగా
జరుపుకోవాలి  జనులంతా
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ
స్వాగతం పలుకుదాం కొత్త సంవత్సరానికి
కరోనా బాధలు తొలిగి పోవాలని, 
ప్రజలంతా సుఖంగా ఉండాలని..

కామెంట్‌లు